పురిటి పాట్లు : గర్భిణిని డోలీలో 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన బంధువులు

విశాఖ మన్యంలో గర్భిణిలకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరక యాతన పడుతున్నారు. గర్భిణిని డోలీలో 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు బంధువులు.

  • Published By: veegamteam ,Published On : September 11, 2019 / 01:16 PM IST
పురిటి పాట్లు : గర్భిణిని డోలీలో 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన బంధువులు

విశాఖ మన్యంలో గర్భిణిలకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరక యాతన పడుతున్నారు. గర్భిణిని డోలీలో 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు బంధువులు.

విశాఖ మన్యంలో గర్భిణిలకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరక యాతన పడుతున్నారు. గర్భిణిని డోలీలో 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు బంధువులు. పాడేరు మండలం వల్లాయి గ్రామానికి చెందిన సూర్యకుమారికి ప్రసవ నొప్పులు రావడంతో.. డోలీలో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొండ ప్రాంతం నుంచి ఏడు కిలోమీటర్లు తరలించడానికి ఎంతో ప్రయాసవడాల్సి వచ్చింది.

సూర్యకుమారికి నొప్పులు రావడంతో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. అయితే అక్కడికి అంబులెన్స్ వెళ్లే మార్గం లేదు. దీంతో స్థానికంగా ఉన్న నలుగురు ఆశా కార్యకర్తలకు కూలీ ఇచ్చి డోలీ కట్టి గర్భిణీని ఏడు కిలోమీటర్ల దూరంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణీ తీసుకెళ్లారు. మార్గంలో రాళ్లు, రప్పలు, ముళ్లు, బురదల్లో తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆమెకు నొప్పులు ఎక్కువగా రావడంతో తీవ్ర బాధను అనుభవించింది. అయితే ఎలాంటి ప్రమాదం లేదని.. చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 

ఆగస్టు నెలలో పాడేరు నియోజకవర్గంలో ప్రసవ నొప్పులతో ఒక గర్భిణీ మృతి చెందింది. ఆమెకు చికిత్స అందించేందుకు డోలీలో తీసుకెళ్లారు. నొప్పులు భరించలేని క్రమంలో మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. ఈలోపు రక్తస్రావం కావడంతో తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వర్షాల కారణంగా ఏజెన్సీల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఒక మహిళ కూడా వాగు దాటలేక ప్రసవించిన ఘటన చోటు చేసుకుంది. 

ఒక్క పాడేరుకు సంబంధించిన నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో వి.మాడు మండంలోనే డోలీలో ఓ గర్భిణీని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నడుచుకుంటూ తీసుకెళ్లగా మగ బిడ్డను ప్రసవించింది. ఆ ఘటన జరిగిన తర్వాత కూడా వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.