సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్

ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 06:34 AM IST
సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్

ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2019, డిసెంబర్ 24 వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. 2019, డిసెంబర్ 26వ తేదీన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 

గతంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును 658 కోట్లకు షాపుర్జీ సంస్థ దక్కించుకుంది. అమరావతిలోని నేలపాడు వద్ద 14.3 ఎకరాల్లో 2000 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం వరుసుగా విజయాలు దక్కించుకుంటుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రానికి మరికొంత ఆదాయం చేకూర్చుతామని ప్రభుత్వం తెబుతోంది. 

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగ కంపెనీని తప్పించింది. గత ప్రభుత్వం ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని సీఎం జగన్ రద్దు చేశారు.