ప్రాణాలు నిలిపిన లాక్‌డౌన్..భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు

  • Published By: nagamani ,Published On : September 19, 2020 / 12:28 PM IST
ప్రాణాలు నిలిపిన లాక్‌డౌన్..భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఏం జరిగినా మన మంచికే అనుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అది అక్షరాల నిజమని నిరూపించింది లాక్ డౌన్. కరోనా మహమ్మారిని నియంత్రించటానికి మూడు నెలలకు పైగా విధించిన లాక్ డౌన్ వల్ల దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం కావటంతో రోడ్డు ప్రమాదాలు భారీ సంఖ్యలో తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. అంటే లాక్ డౌన్ కరోనా రాకుండనే కాదు ప్రాణాలు కూడా కాపాడిందని చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరగని రోజులేదంటే ప్రమాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.


రోడ్డు ప్రమాదాలతోఎన్నో కుటుంబాలో శోక సముద్రంలో మునిగిపోయిన ఘటనలు..అవయవాలు కోల్పోన విషాద ఘటనలు పలు కుటుంబాలల్లో నెలకొన్నాయి. ఈక్రమంలో లాక్ డౌన్ వల్ల గత ఆరేళ్ల కంటే 35 శాతం రోడ్డు ప్రమాదాలు సంఖ్య తగ్గిపోయాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.


కేంద్ర ప్రభుత్వం 68 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. అత్యవసర వాహనాలు మినహా వేరే వాహనాలు రోడ్లపైకి రాలేదు. లాక్‌డౌన్ అయిపోయినప్పటికీ పెద్దగా ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. అవసరం ఉంటేనే బయటికి వస్తున్నారు. విద్య సంస్థలు ఇంకా ప్రారంభం కాకపోవడం మరొక కారణం. దీంతో దేశవ్యాప్తంగా గడచిన ఆరేళ్లలో కంటే 35 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.


2020 జనవరి నుంచి జూన్ వరకు 1,60,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయని కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన లెక్కల్లో తెలిపింది. 2014 నుంచి 2019 వరకు 2,48,000 రోడ్డుప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది తగ్గాయని కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఢిల్లీ, కర్ణాటకలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 45 శాతానికి పైగా తగ్గింది.


2014 నుంచి 2019 వరకు 2,48,000 రోడ్డుప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది తగ్గాయని కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కర్ణాటక, ఢిల్లీలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 45 శాతానికి పైగా తగ్గింది. దేశంలో 68 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం వల్ల వాహనాల రాకపోకలు తగ్గి ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. అంటే లాక్ డౌన్ ప్రజల జీవితాల్లో ఆర్థిక నష్టాన్ని కలిగించినా..ప్రాణాలను కాపాడిందని చెప్పొచ్చు.