ఇంటి దొంగ : నకిలీ బంగారంతో ఎస్ బీఐలో రూ.18 లక్షల రుణం

తిరుపతిలో చంద్రగిరి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Published By: veegamteam ,Published On : October 11, 2019 / 04:07 PM IST
ఇంటి దొంగ : నకిలీ బంగారంతో ఎస్ బీఐలో రూ.18 లక్షల రుణం

తిరుపతిలో చంద్రగిరి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిరుపతిలో చంద్రగిరి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెయ్యి గ్రాములకు పైగా నకిలీ బంగారం తాకట్టుపెట్టి.. దాదాపు రూ.18 లక్షల రుణం పొందారు. ఈ కేసులో సూత్రధారిగా ఉన్న బ్యాంక్‌ అప్రైజర్‌ శివకుమార్‌తో పాటు అతని కుటుంబీకులు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్బీఐ బ్యాంక్ లో అప్రైజర్ గా విధులు నిర్వహిస్తున్న శివకుమార్ తన బంధువులు, స్నేహితులతో  నకిలీ బంగారం తనఖా పెట్టి 18 లక్షల రుణం తీసుకున్నాడు. బంగారం నకిలీదని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు నగదు తిరిగి జమ చేసేందుకు శివకుమార్ కి కొత సమయమిచ్చారు. 

అయితే రికవరీ లేకపోవడంతో చివరికి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంగారం అప్రజర్ తో పాటు ఆయన బంధువులు, స్నేహితులైన ఎనిమిదిమందిపై కేసులు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.