వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్ చోరీ..!

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 04:49 AM IST
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్ చోరీ..!

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చోరో అయిన బస్సులో ప్రయాణీకులు కూడా ఉన్నారు. ప్రయాణీకులతో సహా ఆర్టీసీ బస్సు చోరీ అవ్వటం స్థానికంగా కలకలం సృష్టించింది. 

ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దుండగుడు ఆ బస్సును సిటీ శివారులో రోడ్డుపై బస్సును వదిలేసి పారిపోయాడు. అలా వదిలేసి వెళ్లిన బస్సులో కండక్టర్ కూడా లేడు. ఈ విషయం తెలుసుకున్న సదరు బస్సు కండక్టర్, డ్రైవర్ ఖంగుతిన్నారు. కాగా..తానే డ్రైవర్ ని..కండక్టర్ అని చెప్పిన సదరు దుండగుడు బస్సును ఇష్టానురీతిగా డ్రైవ్ చేస్తుండటంతో అతను మద్యం సేవించాడనే అనుమానతం ప్రయాణీకులు సదరు వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో సదరు దుండగుడు బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రయాణీకులు పోలీసులకు..ఫిర్యాదు చేశారు. తరువాత డిపో మేనేజర్ కు కూడా చెప్పారు.  వెంటనే బస్సు ఉన్న ప్రాంతానికి వచ్చిన పోలీసులు ప్రయాణీకులను ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై వికారాబాద్ డిపో మేనేజన్ రాజశేఖర్ మాట్లాడుతూ..తాండూరు డిపోలో బస్సును ఆపి  దిగిన డ్రైవర్, కండర్టర్ భోజనానికి దిగారనీ..తరువాత వచ్చి చూడగా ఆపి ఉంచిన బస్ కనిపించకపోవటంతో తనకు చెప్పారని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. దీంతో సెక్యూరిటీ వారు బస్సు కోసం వెతికినా కనిపించలేదు. అంతలో మిస్ అయిన బస్సులో ఉండే ఓ ప్రయాణీకుడు అసలు విషయాన్ని చెప్పాడనీ అన్నారు. ఓ వ్యక్తి వచ్చి బస్ ను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడని తరువాత ఆ బస్సును వికారాబాద్ సిటీ శివారులో ఆపేసేశాడని తమకు అనుమానం వచ్చిన అతన్ని ప్రశ్నించగా అతను బస్సును వదిలేసి పారిపోయాడని చెప్పారని రాజశేఖరు తెలిపారు. వెంటనే  బస్సు డ్రైవర్ ని, కండక్టర్ ను పంపించామని..తరువాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. 

కాగా..గతంలో కూడా ఓ సారి కుషాయిగూడలో ఆర్టీసీ బస్సు చోరీకి గురవ్వటం జరిగింది. ఈ ఘటన మరోసారి జరగటంతో ఆర్టీసీ యాజమాన్యం గానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యమని ప్రయాణీకులు విమర్శిస్తున్నారు.డిపోలో ఆపి ఉన్న ఆర్టీసీ బస్సులే చోరీకి గురవ్వటంపై అధికారుల నిర్లక్ష్యమేనని ప్రయాణీకులు భావిస్తున్నారు.కానీ  ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 

Read More>> పూజా పాప ముందు ప్యారిస్ అందాలు చిన్నబోయాయే..