అశ్వత్థామరెడ్డి అమ్ముడుపోయాడని ఆరోపిస్తూ : NMU నేత ఆత్మహత్యాయత్నం

తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 03:00 AM IST
అశ్వత్థామరెడ్డి అమ్ముడుపోయాడని ఆరోపిస్తూ : NMU నేత ఆత్మహత్యాయత్నం

తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన

తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ నేత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఈ ఘటనకు పాల్పడ్డాడు.

అశ్వత్థామరెడ్డి ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని ఎన్‌ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఆరోపించారు. 52 రోజుల పాటు సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన రవి నాయక్‌.. సోమవారం(నవంబర్ 25,2019) రాత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రవినాయక్ కు అడ్డుకున్నారు. అతడిని వారించారు. ఒంటి మీద దుస్తులు తీసేశారు. తొందరపడి అఘాయిత్యం చేసుకోవద్దని సర్ది చెప్పారు.

ఆర్టీసీ సమ్మె ముగిసింది. 52 రోజుల ఆందోళనకు తెరపడింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను బేషరతుగా విరమించారు కార్మికులు. సమ్మె విరమిస్తున్నామని సోమవారం (నవంబర్ 25,2019) సాయంత్రం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం(నవంబర్ 26,2019) నుంచి కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావొద్దని కోరారు. నైతిక విజయం తమదేనని చెప్పారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, సమ్మె విరమణ ప్రకటనను కొందరు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఇంతవరకు వచ్చాక సమ్మె విరమించడం ఏంటని మండిపడుతున్నారు.