RTO ఇంట్లో ఏసీబీ సోదాలు : రూ.10 కోట్లపైనే ఆస్తులు!

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 07:01 AM IST
RTO ఇంట్లో ఏసీబీ సోదాలు : రూ.10 కోట్లపైనే ఆస్తులు!

కర్నూలు జిల్లాలలో ఏబీసీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్  ఇంట్లో సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్టీవో అధికారి శివప్రసాద్ కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో.. సోదాలు చేపట్టారు  అధికారులు. దీంట్లో భాగంగా..కర్నూలు, హైదరాబాద్, తాడిపత్రి,  బెంగళూరులలో సోదాలు చేయగా..ఇప్పటి వరకూ రూ.10కోట్లకు పైగా విలువ కలిగిన ఆస్తులను అధికారులు గుర్తించారు. 

కిలో బంగారం, వెండి, కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని..సీజ్ చేశారు. హైదరాబాద్ లో ఖరీదైన స్థలాలు. జీ ప్లస్ త్రీ భవనంతో పాటు పలు బినామీ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. రవాణాశాఖలో ఏవీఐగా పనిచేస్తున్న అక్కిరాజు శిప్రసాద్ కు బినామీగా గాజుల రామారావు ఉన్నాడు. అతని పేరుమీద శివప్రసాద్ భారీగా ఆస్తుల్ని బెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గుర్తించిన ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని..విలువైన బంగారం,వెండి వస్తువులను సీజ్ చేశారు.