మరొకరు వచ్చారు.. సీఎం జగన్ సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్… ఎవరాయన?

ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. జగన్ కు మరో సలహాదారును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 03:36 AM IST
మరొకరు వచ్చారు.. సీఎం జగన్ సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్… ఎవరాయన?

ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. జగన్ కు మరో సలహాదారును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్

ఏపీ సీఎం జగన్ మరో సలహాదారుని నియమించుకున్నారు. జగన్ కు మరో సలహాదారును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకు ఆర్ధిక సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమిస్తూ సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి  ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలిచ్చారు. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ప్రభుత్వం గార్గ్ ను నియమించింది. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది.

సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవముంది. గార్గ్.. రాజస్థాన్‌ కేడర్-1983 ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ గార్గ్ వ్యవహరించారు.

సీఎం జగన్ కు ఇప్పటికే అనేక మంది సలహాదారులు ఉన్నారు. మీడియాతో పాటు అనేక రంగాల్లో అడ్వైజర్లను నియమించుకున్నారు. ఇప్పుడు ఇంకో సలహాదారు వచ్చారు. మరో అడ్వైజర్ తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు… ప్రభుత్వం.. పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడం చాలా అవసరం.

ఆ కసరత్తులో భాగంగానే సీఎం జగన్ ఈ తాజా నియామకం చేసినట్టు అర్థమవుతోంది. ఈ కొత్త సలహాదారు నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. గతంలో గార్గ్ చేసిన పదవులు, ఆయన అనుభవం.. నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు.

గార్గ్ ను ఆర్థిక సలహాదారుగా నియమించిన ప్రభుత్వం.. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి(ఆర్థిక వనరుల సమీకరణ)గా మిశ్రాను నియమించింది. ఏపీ ఆర్థిక సంస్థ ఎండీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది.(కర్నూలులో తిరగలేరు… మంత్రికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్)