కిప్‌ ఇట్ అప్‌ : నాసా యాత్రకు ఏపీ విద్యార్థిని

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 05:50 AM IST
కిప్‌ ఇట్ అప్‌ : నాసా యాత్రకు ఏపీ విద్యార్థిని

భాష్యం IIT అకాడమీ ఫౌండేషన్‌లో 9వ తరగతి చదువుతున్న జి.సాయి పూజిత అమెరికాలోని నాసా సందర్శనకు వెళ్లనుంది. ఆస్ట్రానాట్ మెమోరియల్ సంస్థ, ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ, గో ఫర్ గురు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ పరీక్షలో పూజిత అద్బుత ప్రదర్శన కనబరిచింది. దేశవ్యాప్తంగా 826 విద్యాసంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.

భారత్‌ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎన్నికయ్యారు. అందులో గుంటూరు భాష్యం ఐఐటీ ఫౌండేషన్‌ అకాడమీ విద్యార్థిని సాయి పూజిత ఉంది. ఈ సందర్భంగా భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్ ఆశాలత సాయి పూజితను సత్కరించారు. దేశానికి మంచి పేరు తెచ్చిందని కొనియాడారు. పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో నాసా సందర్శనకు సాయి పూజిత ఎన్నికైనట్లు తెలిపారు భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్‌ ఆశాలత. సాయి పూజిత సెప్టెంబర్ 30న నాసా సందర్శనకు వెళ్లనున్నట్లు తెలిపారు.

10 రోజులపాటు అమెరికాలోని నాసా స్పేస్ సెంటర్‌ను సందర్శిస్తుందన్నారు. భాష్యం టీచర్స్ గైడెన్స్, పేరెంట్స్ సపోర్ట్‌ వల్లే నాసా సందర్శనకు ఎన్నికయ్యానని సాయి పూజిత తెలిపింది. కష్టపడి చదవి మరిన్ని విజయాలు సాధిస్తానంది. నాసా సందర్శనార్థం ఉచితంగా విమాన టికెట్‌ను నాసా వ్యోమగామి డాక్టర్ డాన్ ధామస్ అందించారని, అబ్దుల్ కలాం మై ఇన్‌స్పిరేషన్, మై హీరో అనే అంశంపై రాసిన వ్యాసానికి గాను సాయి పూజిత అర్హత సాధించినట్లు వెల్లడించారు. 
Read More : కోన వెంకట్‌పై చీటింగ్ కేసు