మేడారం మహాజాతర తేదీలు ఖరారు

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 02:54 AM IST
మేడారం మహాజాతర తేదీలు ఖరారు

మేడారంలో 2020లో నిర్వహించే శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మాఘ శుద్ధ పౌర్ణమి గడియలను ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటించారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో పూజారులు, ఇతరులు సమావేశమయ్యారు. 

ఫిబ్రవరి 5వ తేదీ కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకొస్తారు.
ఫిబ్రవరి 6వ తేదీ గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకొస్తారు.
ఫిబ్రవరి 7వ తేదీన వన దేవతలకు మొక్కుల చెల్లింపు. 
ఫిబ్రవరి 8వ తేదీన తల్లుల వనప్రవేశం ఉంటుంది. 
2018లో జరిగిన జాతరకు సంబంధించి తేదీలను 6 నెలల ముందుగా ప్రకటించారు. కానీ 2020 జాతర తేదీలను 9 నెలల ముందుగానే ప్రకటించడం విశేషం.