నవంబర్ నెలాఖరుకి ఇసుక సమస్య తీరుతుంది : సీఎం జగన్ 

  • Edited By: veegamteam , November 4, 2019 / 09:46 AM IST
నవంబర్ నెలాఖరుకి ఇసుక సమస్య తీరుతుంది : సీఎం జగన్ 

రోడ్లు భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇసుక విషయంలో విపక్షాలు రాద్దాంత చేస్తున్నాయనీ..ఇసుక సమస్య తాత్కాలికమని అన్నారు. 265కి పైగా ఇసుక రీచుల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయనీ మిగతావన్నీ వరద నీటిలో మునిగిపోయయనీ అందుకే ఇసుక సమస్య తలెత్తిందనీ తెలిపారు. ఈ సమస్య నవంబర్ నెలా ఆఖరుకల్లా క్లియర్ అవుతుందని భావిస్తున్నామని అన్నారు. 

భారీ వర్షాలతో వరద నీరు చేరుకోవటం వల్లనే ఈ రీచ్ లు పనిచేయటంలేదని అన్నారు. వర్షాలు కురవటం..నీరు రావటం రైతులకు, పంటలకు ఎంతో మంచిదనీ..భూ గర్భ జలాలు కూడా పెరుగుతాయని ఈ వరదల వల్ల ఏర్పడిన తాత్కాలిక ఇసుక కొరత..నవంబర్ నెలాఖరుల్లా ఇసుక కొరత తీరిపోతుందని భావిస్తున్నామన్నారు.
 
గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల పాటు ఇసుక మాఫియా కొనసాగింది. కానీ తమ ప్రభుత్వం ఇసుక విధానం విషయంలో మార్పులు తీసుకొచ్చి.. పారదర్శకత తీసుకొచ్చిందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాల్ని రూపొందించామని సీఎం జగన్ స్పష్టంచేశారు.