ఇసుక అక్రమరవాణా చేస్తే రూ.2లక్షలు జరిమానా, 2 ఏళ్ల జైలు

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 09:58 AM IST
ఇసుక అక్రమరవాణా చేస్తే రూ.2లక్షలు జరిమానా, 2 ఏళ్ల జైలు

ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోసింది. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణా చేసే వారికి  రూ.2 లక్షల జరిమానా మాత్రమే విధించేవారు.  కానీ ఇప్పుడు జైలు శిక్ష కూడా అంటూ ఝలక్ ఇచ్చింది సీఎం జగన్  కేబినెట్. 

సీఎం జగన్ ఇసుక వారోత్సవాలపై సీఎం జగన్ పలు సూచనలు చేసారు. అనంతరం ఇసుక అక్రమ రవాణాపై సంచలన నిర్ణయం తీసుకుంటూ జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్షకూడా విధించబడుతుందంటూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

అంతేకాదు పట్టణాల్లో అక్రమంగా నిర్మించే లే అవుట్లను క్రమబద్దీకరించేలా కేబినెట్ నిర్ణయిం తీసుకుంది. కనీసం 37 అడుగుల రోడ్డు ఉండేలా లే అవుట్లను క్రమబద్దీకరిస్తామన్నది. లే అవుట్ల విస్తీర్ణం ఆధారంగా పెనాల్టీలు కూడా విధించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.