హ్యాక్ అయిన ఏపీ ప్రభుత్వ ఇసుక వెబ్ సైట్

  • Published By: vamsi ,Published On : November 13, 2019 / 01:51 PM IST
హ్యాక్ అయిన ఏపీ ప్రభుత్వ ఇసుక వెబ్ సైట్

అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకుని వచ్చింది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ఇసుక అక్రమాలకు పాల్పడిందంటూ వైసీపీ సర్కార్ కొత్త ఇసుక విధానాన్ని తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఇసుక వెబ్ సైట్ ఇప్పుడు హ్యాక్ అయ్యింది. బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ ప్రభుత్వ వెబ్ సైటును హ్యాక్ చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఐడీ బ్లూ ఫ్రాగ్ కంపెనీలో సోదాలు నిర్వహించింది. ఇసుక కృత్రిమ కొరత సృష్టించేందుకు వెబ్ సైట్‌ను హ్యాక్ చేసినట్లుగా సీఐడీ గుర్తించింది. పలు కీలక ఆధారాలు సీఐడీకి లభించాయి. గతంలో కూడా బ్లూ ఫ్రాగ్ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. 

ఇసుక డంపింగ్ యార్డ్‌ల్లో ఉన్నప్పటికీ వెబ్ సైట్లలో అవి కనిపించట్లేదు. బ్లూ ఫ్రాగ్ కంపెనీలు గతంలో  కూడా ఇటువంటి పనులు చేసినట్లుగా సీఐడీ అధికారులు చెబుతున్నారు. కావాలని కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ గతంలో కూడా డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటుంది.