సంక్రాంతి ఎఫెక్ట్ : కొండెక్కిన కోడి,మండిపోతున్న మటన్

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 07:50 AM IST
సంక్రాంతి ఎఫెక్ట్ : కొండెక్కిన కోడి,మండిపోతున్న మటన్

హైదరాబాద్ : కోడి కొండెక్కింది. మటన్ మండిపోతోంది. పండగ వచ్చిందంటే చాలు…ముక్క లేనిది ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు కాస్తంత నిరాశే. సంక్రాంతి ఎఫెక్ట్ తో చికెన్, మటన్ లతో పాటు ఫిష్ లకు కూడా భారీ డిమాండ్ వచ్చేసింది. గత నాలుగు రోజుల్లోనే నాన్ వెజ్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కనుము పండుగ వరకూ ఇంట్లో మేకలను, కోళ్లను కోయకు కాబట్టి తప్పనిసరిగా బైటే మాంసాన్ని కొంటారు. దీంతో  నాన్ వెజ్ లన్నీ రూ. 60వరకు ఒక్కసారిగా పెరిగాయి.

మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి పండగంటే ఇంటికి కూతుళ్లు, అల్లుళ్లు.. వస్తుంటారు. మరి అల్లుడు వచ్చాడంటే కోడి కోయాల్సిందే. దీంతో పండుగ తెలుగు రాష్ట్రాల్లో మాంసానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇంకేముంది మటన్ గత మూడు నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కిలోకు రూ. 50 నుంచి రూ. 60 వరకు పెరిగి కిలో మాంసం ధర ఏకంగా రూ. 600 దాటేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు హైదరాబాద్ వచ్చి మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తుండడమే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే మేకలు, గొర్రెల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. అయినా ధరలు ఆకాశంలోనే వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర వ్యాపారులు మేకలు, గొర్రెలను తీసుకొచ్చి అమ్మేవారు. ఇప్పుడు సంక్రాంతి పేరుతో అవికూడా పెరిగిపోవటంతో తప్పనిసరిగా రేటు పెంచాల్సి వచ్చిందంటున్నారు మాంసం వ్యాపారులు. 
అంతేకాదు..రోజువారీ వినియోగంకూడా పెగటం కూడా మాంసం ధరలు పెగటానికి కారణమని జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ ఏటా 20 శాతం పెరుగుతోందని పశుసంవర్థక శాఖ కూడా చెబుతోంది.