శ్రీవారి రథానికి నిప్పు పెట్టారు

  • Published By: vamsi ,Published On : February 14, 2020 / 05:44 AM IST
శ్రీవారి రథానికి నిప్పు పెట్టారు

నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. జిల్లాలోని బోగోలు మండలం బిట్రగుంట కొండపై కొలువైన శ్రీవారి రథం శుక్రవారం తెల్లవారుఝామున దగ్ధం అయ్యింది. ఆలయ ఆవరణలో నిలిపి ఉంచిన ప్రాచీన రథం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే రథం అర్ధరాత్రి మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు.

అయితే అప్పటికే మంటలు వ్యాపించి రథం పూర్తిగా కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు రథానికి నిప్పు పెట్టి ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానుండగా.. ఆ బ్రహ్మోత్సవాలకు ముందే ఘటన చోటుచేసుకోవడంపై భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

బిట్రగుంట కొండపై జరిగే తిరనాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. ఆ తిరనాళ్లకు ముందే ఇలా జరగగా.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బిట్రగుంట ఎస్సై భరత్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్