ఫోటోలు, వీడియోలు, కాల్స్‌తో వేధిస్తే మాకు చెప్పండి : బాధితులకు భరోసాగా ‘షీ టీమ్స్’

  • Published By: nagamani ,Published On : September 11, 2020 / 11:47 AM IST
ఫోటోలు, వీడియోలు, కాల్స్‌తో వేధిస్తే మాకు చెప్పండి  : బాధితులకు భరోసాగా ‘షీ టీమ్స్’

SHE TEAM – HYDERABAD CITY POLICE: షీ టీమ్స్‌. హైదరాబాద్ నగరంలో ఆకతాయిలకు ఈ పేరు చెబితే హడల్. అమ్మాయిలను వేధిస్తే హలో అని బాధితులు కాల్ చేస్తే వెంటనే వచ్చివాలిపోతారు.ఆకతాయిలను..పోకిరీల ఆటలు కట్టిస్తారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళల భద్రత కోసం 10 టీములతో ఏర్పడిన షీ టీమ్స్‌ నిరంతరం కృషి చేస్తుంది. ఏ సమయంలోనైనా సరే మహిళలు, యువతులు, ఉద్యోగినులు కాల్ చేస్తే చాలు షీ టీమ్ మెంబర్స్ స్పందిస్తారు. మహిళలు..యువతులు..బాలికల కోసం నిరంతరం సేవలందిస్తోంది షీటీమ్స్.


పోకిరీల వేధింపులకు గురైన 143 మంది బాధితులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ వారి బాధలు వింది. బాధితులను విచారించి.. మొత్తం 28 కేసులను నమోదు చేసింది. ఇందులో 11 మందిపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు. బాధితుల ఫిర్యాదుతో డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టి.. ఆకతాయిలు, ఈవ్‌ టీజర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు చిన్నారులకు బలవంతంగా పెళ్లిళ్లు చేసేవారిపై కూడా షీటీమ్స్ కొరడా ఝుళిపిస్తోంది. పక్కా సమాచారంతో పలు బాల్య వివాహాలను ఆపి.. బాలికలకు విముక్తి కల్పించాయి.


మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగినికి.. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంపత్‌తో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరగా చేసుకున్న అతడు బాధితురాలి మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్‌లో పోస్టు చేశాడు. దీంతో బాధితురాలికి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఆందోళనకు గురైన బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన షీ టీమ్స్‌ నిందితుడు సంపత్‌ను అరెస్ట్‌ చేసి తదుపరి విచారణ కోసం రాంచంద్రాపురం పోలీసులకుఅప్పజెప్పింది.



https://10tv.in/danger-zone-paracetamol-alters-your-perception-of-risk-and-puts-you-in-danger/
మాదాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి అపస్మారకస్థితిలో ఉన్నప్పడు నగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు తీసిన అరుణ్‌రెడ్డి అనే ఓ వ్యక్తి ఆ ఫోటోలతో ఆమెన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురయ్యేది. దాన్ని అదనుగా చేసుకుని మరింతగా రెచ్చిపోయాడు..ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తికి..ఆమె స్నేహితులకు పంపించి బెదిరింపులకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా నువ్వు నాదగ్గరకు రావాలని నా కోరిక తీర్చాలని బెదిరించేవాడు.దీంతో ఆమె వాట్సాప్‌ ద్వారా షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన షీ టీమ్స్‌ అరుణ్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి రాయదుర్గం పోలీసులకు అప్పజెప్పింది.


వేధిస్తే.. ఫిర్యాదు చేయండి…మేమున్నామంటూ బాధితులకు షీటీమ్స్ అండగా నిలుస్తున్నాయి. ఎవరైనా వేధించినా, బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినా, బెదిరింపులకు దిగినా భయపడకుండా బాధితులు.. తమ దృష్టికి తీసుకురావాలని షీటీమ్స్ సూచించాయి. అఘాయిత్యాలపై సైబరాబాద్‌ షీ టీమ్స్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, హాక్‌ ఐ, వాట్సాప్‌ నంబర్‌-9490617444, డయల్‌ 100…లేదా స్థానిక షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని పోలీసులు కోరుతున్నారు. ఫిర్యాదు అందగానే పోలీసుల సేవలు వేగంగా అందుతాయని షీ టీమ్స్‌ పోలీసులు భరోసా ఇస్తున్నారు.