తలకెక్కిన కిక్కు : SI కాలు విరిచేసిన తాగుబోతులు 

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 06:28 AM IST
తలకెక్కిన కిక్కు : SI కాలు విరిచేసిన తాగుబోతులు 

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తాగుబోతులు రెచ్చిపోయారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న ఎస్సై శ్రీకృష్ణపైకి ఓ కారు దూసుకుపోయింది. దీంతో ఎస్సైకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాలు విరిగిపోయింది. వెంటనే  ఎస్సై ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

తాగి కారు నడుపుతున్న వారు తనిఖీలు చేస్తున్న పోలీసుల్ని గమనించారు. పోలీసుల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూశారు. దీంట్లో కారును స్పీడ్ గా నడిపారు. వారిని అడ్డుకోబోయిన ఎస్సైను తమ వాహనంతో డాష్ ఇచ్చారు. ఈ ప్రమాదంలో ఎస్సై శ్రీకృష్ణకు కాలు విరిగిపోయింది.

అక్కడే ఉన్న పోలీసులు సదరు తాగుబోతుల్ని అతికష్టమ్మీద అడ్డుకున్నారు. వెంటనే  ఎస్సై ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఎస్సై శ్రీకృష్ణ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.