కథ ముగిసింది : అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సింగపూర్‌

ఏపీ రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 06:59 AM IST
కథ ముగిసింది : అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సింగపూర్‌

ఏపీ రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర

ఏపీ రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం అమరావతి స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై అంతగా ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు.

రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాజెక్టును చేపట్టాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 2017లో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల దేశంలోని ఇత రాష్ట్రాల్లో సింగపూర్ కంపెనీ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు.

ఏపీతో పాటూ మిగిలిన రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సింగపూర్ కంపెనీలు ఇకపైనా ఆసక్తి కనబరుస్తాయన్నారు మంత్రి ఈశ్వరన్. పెట్టుబడులు పెట్టేందుకు భారత్ మంచి అవకాశాలు ఉన్న మార్కెట్‌గా ఆయన చెప్పారు. 

రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), సింగపూర్ కన్సార్టియంతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంలో అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ సంస్థను ఏర్పాటు చేశారు. రాజధానిలోని 6.84 చదరపు కిలోమీటర్లను స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. పీపీపీ విధానంలో స్టార్టప్ ఏరియాను సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్స్ ద్వారా నిర్వహించేందుకు ఏపీసీఆర్‌డీఏ అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది.

స్టార్టప్ ఏరియా కింద 1691 ఎకరాల్లో దాదాపు 460 ఎకరాల్లో సదుపాయాలు కల్పించాల్సి ఉంది. మిగిలిన 1230 ఎకరాలను మూడు దశల్లో విక్రయించేందుకు ప్రతిపాదించారు. దీనికి సంబంధించి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ పేరున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగేందుకు జగన్ ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో చర్చలు జరిపింది. ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని సింగపూర్ కంపెనీ నిర్ణయించింది.

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుని 17 నెలలు గడిచాయి. అయినా ఇప్పటివరకు ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. దీంతో అమరావతికి లభిస్తుందని ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ ఇచ్చిన నివేదికను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.