బిగ్ బాస్ ఐదవ సీజన్.. ఫస్ట్ కంటెస్టెంట్ అతనే!

బిగ్ బాస్ ఐదవ సీజన్.. ఫస్ట్ కంటెస్టెంట్ అతనే!

బిగ్‌బాస్ నాల్గవ సీజన్.. తర్వాత ఇప్పుడు ఐదవ సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పుడు బిగ్‌బాస్ యూనిట్ ప్రారంభించేసింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు ఐదవ సీజన్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనౌే బిగ్‌బాస్ ఐదవ సీజన్ కోసం కంటెస్టెంట్లను వెతికే పనిలో దృష్టిసారించింది బిగ్‌బాస్ యూనిట్.

ఈ సీజన్‌కు హోస్ట్ నాగార్జునే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. కంటెస్టెంట్‌లు ఎవరు అనేదానిపై ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముందుగా ఈ సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ మొద‌లు పెట్టిన నిర్వాహ‌కులు. తొలి కంటెస్టెంట్‌గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ను ఎంపిక చేసిన‌ట్టు చెబుతున్నారు.

షణ్ముక్‌కి సోష‌ల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముక్‌ను మూడవ సీజన్‌కే నిర్వాహ‌కులు సెల‌క్ట్ చేయగా.. అప్పట్లో కుదరలేదని, ఇప్పుడు వర్క్ఔట్ అయినట్లుగా తెలుస్తోంది. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)