ప్లాట్ ఫాం టిక్కెట్ రూ.10 నుంచి రూ.50కి పెంపు..

  • Published By: nagamani ,Published On : September 12, 2020 / 07:02 AM IST
ప్లాట్ ఫాం టిక్కెట్ రూ.10 నుంచి రూ.50కి పెంపు..

south-western-railway-hikes-platform-ticket-price

రైల్వే ప్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10నుంచి రూ.50కు పెంచింది రైల్వే శాఖ. సాధారణంగా పండుగ సీజన్లలో రైల్వేస్టేషన్లలో రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో రైల్వే శాఖ ప్లాట్ ఫాం టిక్కెట్ ధరను పెంచేస్తుంది. కానీ ఇది కరోనా కాలం అంతా ఉల్టా..మనిషి జీవిత చక్రం ఒక్కసారిగా వెనక్కి ఎలా తిరింగిందో..అలాగే ఈ కరోనా కాలంలో రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జనాల రద్దీ ఉంటే ప్లాట్ ఫాం టిక్కెట్ పెంచే రైల్వే శాఖ..రైల్వే స్టేషన్ లో రద్దీ తగ్గించేందుకు సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్లాట్ ఫాం టిక్కెట్ ధరను పెంచేసింది.


అదేంటి రద్దీ ఉంటే పెంచుతారు గానీ రద్దీ తగ్గించటానికి ప్లాట్ ఫాం టిక్కెట్ ధర పెంచటమేంటి అని ఆశ్చర్యపోవచ్చు..అదేమరి కరోనా కాలం అంటే..ఈ కరోనా కాలంలో రద్దీని తగ్గించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది సౌత్ వెస్ట్రన్ రైల్వే. ప్లాట్ ఫాం టిక్కెట్ ను రూ.10 నుంచి రూ.50కి పెంచేసింది. బెంగళూరులోని మూడు స్టేషన్‌లలో ఫ్లాట్‌ఫామ్‌ ధరలను అమాంతం పెంచేసి..గతంలో గతంలో ఉండే రూ.10లకు ఇప్పుడు రూ.50లకు పెంచేసింది.


బెంగళూరులోని బెంగళూరు కంటోన్‌మెంట్‌, కేఎస్‌ఆర్ బెంగళూరు, యశ్వంత్‌పూర్ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లో ఇకపై ఫ్లాట్‌ఫామ్‌ల ధర రూ.50కు పెంచింది. మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వేశాఖ గతంలో శుభవార్త చెప్పింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో క్లోన్ ట్రైన్స్‌ని నడుపుతామని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా..పెంచి ప్లాట్ ఫామ్ టికెట్ల ఈ ధరలను కొనసాగిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ధరలు తాత్కాలికంగా పెంచినవి మాత్రమేనని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారిక ప్రకటనలో స్పష్టంచేసింది.


కాగా..ఇప్పటికే సర్వీసులను అందిస్తున్న 230 ప్రత్యేక రైళ్లతో పాటు సెప్టెంబర్ నెల 12 నుంచి దేశవ్యాప్తంగా 80 ప్రత్యేక రైళ్లు నడవనుంది.ఈ రైళ్లకు టికెట్ బుకింగ్ గురువారం (సెప్టెంబర్ 10,2020)నుంచి ప్రారంభమైంది. ఈ 80 ట్రైన్స్ లో 24 ట్రైన్స్ Delhi నుంచి వివిధ స్టేషన్లకు..పలు స్టేషన్ల నుంచి ఢిల్లీ వెళ్లటానికి అందుబాటులో ఉంటాయి.


దేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా టికెట్ బుకింగ్ కోసం రిజర్వేషన్ కౌంటర్లకు జనాలు రాకుండా ఉండాలని..సాధ్యమైనంత వరకూ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.
https://10tv.in/diksha-app-for-jio-phone-how-to-download-and-use-diksha-app-on-jio-phones/
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మార్చిలో రైలు సేవలను నిలిపివేశారు. అనంతరం మే నుండి తిరిగి ప్రారంభించి..దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వలస కార్మికులను వారి వారి స్వంత ప్రాంతాలకు తరలించటానికి శ్రామిక్ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఆ సమయంలోనే కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా ప్రవేశపెట్టింది.