SRH vs RR: టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్

ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్‌ను ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.

SRH vs RR: టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్

ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్‌ను ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.

ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్‌ను ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్‌లో సొంతగడ్డపై ఆడుతోన్న తొలి సమరాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయాన్ని తుడిచిపెట్టేయాలని భావిస్తోంది. అనారోగ్యం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తుదిజట్టులో విలియమ్సన్ ఉంటే, వార్నర్‌తో కలిసి ప్రభంజనం సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.

మరో వైపు రాజస్థాన్ రాయల్స్.. కూడా దూకుడు మీదే కనిపిస్తోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతుల్లో కొద్దిపాటి వ్యత్యాసంతో ఓటమికి గురైన రాజస్థాన్ పొరబాట్లు పునరావృతం కాకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. రహానె నాయకత్వంలో జట్టు గత మ్యాచ్ లో దూకుడునే ప్రదర్శిస్తే పోటీ హోరాహోరీగా సాగనుంది. 
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే