శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు : ఒంటిమిట్ట కోదండ రామయ్య ముస్తాబు

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 03:58 AM IST
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు : ఒంటిమిట్ట కోదండ రామయ్య ముస్తాబు

కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రాముని ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 13,219) ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ముఖద్వారంతో పాటు రంగమండపాన్ని పూలతో అలంకరించారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఘన చరిత్ర కలిగిన ఒంటమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ఈవో సింఘాల్ ఒంటిమిట్టలో పర్యటించి శ్రీరామనవమి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయం చుట్టూ ఉన్న మాడావీధులను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కల్యాణం రోజున లక్షల్లో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అదనపు వసతి, భోజనం, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారామలు కళ్యాణం ఘట్టాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.