మత్తు పదార్థాల స్మగ్లర్లపై కఠిన చర్యలు

  • Edited By: veegamteam , November 8, 2019 / 11:13 AM IST
మత్తు పదార్థాల స్మగ్లర్లపై కఠిన చర్యలు

విద్యాసంస్థలకు మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన (శుక్రవారం నవంబర్ 8, 2019) మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలకు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామన్నారు.

విద్యార్థులు మాదకద్రవ్యాల ఉచ్చులో పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. డ్రోన్లు, రిమెట్ సెన్సింగ్ డేటా ద్వారా గంజాయి పంటను గుర్తించి, ధ్వంసం చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు దక్షిణాది రాష్ట్రాల పోలీసులు సరస్పరం సహకరించుకోవాలని సూచించారు.