‘ఆహా’ లో అల్లు అర్జున్.. ఎప్పుడంటే!

  • Published By: sekhar ,Published On : November 10, 2020 / 12:35 PM IST
‘ఆహా’ లో అల్లు అర్జున్.. ఎప్పుడంటే!

Allu Arjun: సరికొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ఇటీవల పలు భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలతో పాటు మంచి వెబ్ సిరీస్‌ అందిస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ లో సమంత, తమన్నా, విజయ్ దేవరకొండ వంటి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేస్తున్నారు.



ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆహా’ తో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ మీదకు ఎంట్రీ ఇవ్వనున్నారు. అంటే బన్నీ ఏదైనా స్పెషల్ ఇంటర్వూ లేదా వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారా అనే డౌట్ కాసేపు పక్కన పెడితే.. నవంబర్ 13 సాయంత్రం 5 గంటలకు వర్చువల్‌గా డిజిటల్ ఆడియెన్స్ అందర్నీ పలకరించనున్నారని ‘ఆహా’ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.




https://10tv.in/allu-arjun-kids-dance-video-gone-viral/
దీంతో ఆ రోజు బన్నీ ఏం మాట్లాడబోతున్నారు.. దేని గురించి మాట్లాడుతున్నారు.. ఏం సర్‌ప్రైజ్ చేయబోతున్నారు.. అనే క్యూరియాసిటీ బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌లోనూ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆ రోజు ‘ఆహా’ కోసం బన్నీ చేసిన కొన్ని ప్రమోషనల్ వీడియోస్ స్ట్రీమ్ అవనున్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది.