వానలో వచ్చిన అదృష్టం : రూ.కోటి .18 లక్షల లాటరీ తగిలింది

  • Published By: nagamani ,Published On : August 20, 2020 / 10:39 AM IST
వానలో వచ్చిన అదృష్టం : రూ.కోటి .18 లక్షల లాటరీ తగిలింది

మనం బైటకెళ్లేటప్పుడు వర్షం పడితే..గబగబా దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుంటాం. కానీ వర్షం ఎంతకీ తగ్గపోతే..విసుక్కుంటాం..ఎప్పుడు తగ్గుతుందిరా బాబూ ఇంటికెళ్లాలి..అనుకుంటాం. కానీ ఓ వర్షమే ఓ అదృష్టంగా మారితే ఎలా ఉంటుంది? వర్షం అదృష్టమా అందులోనే ఈ కరోనా కాలంలో తడిస్తే జలుబు వస్తుంది..ఆ తరువాత జ్వరం వస్తుంది..ఆనగా కరోనా కూడా రావచ్చు..కాబట్టి వర్షంలో తడవటం అంత మంచిది కాదు అదృష్టం అంతకంటే కాదు అని అంటారు కదూ..అదీ నిజమే. కానీ అదృష్టం మన వెంటే ఉంటే వర్షమే కాదు వరద కూడా ఏమీ చేయలేదు. అదే జరిగింది అమెరికాలోని వర్జీనియాలో ఓ వ్యక్తి విషయంలో..



అది అమెరికాలోని వర్జీనియా.. పీటర్స్‌బర్గ్‌లో ఉండే గార్లాండ్ హ్యరీసన్ అనే వ్యక్తి‌ ఏదో పనిమీద బయటకు వెళ్తుండగా దారిలో అనుకోకుండా భారీ వర్షం పడింది. వర్షం నుంచి తలదాచుకోవటానికి హ్యారీసన్‌ దగ్గరలో ఉన్న ఓ షాపింగ్‌మాల్‌లోకి వెళ్లాడు. కానీ బోర్ కొడుతోంది..అలా టైంపాస్ కోసం అవీ ఇవీ చూస్తూ..అక్కడ తిరుగుతుండగా ఓ లాటరీ టిక్కెట్స్ అమ్మే షాప్ కనపడింది.



హా ఏముందిలే తగిలేనా పాడా..అనుకుంటూ టైమ్ పాస్ కోసం ఓ టికెట్‌ కొన్నాడు. వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజులకు అతడు కొన్న లాటరీ టికెట్ ఫలితాలను నిర్వాహకులు ప్రకటించారు. అందులో హ్యరీసన్ కొన్న లాటరీ టికెట్ కు 1,58,377 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.కోటి 18లక్షలు) నగదు బహుమతి వచ్చింది. దీంతో ఆనందాశ్చర్యాలకు గురైన హ్యారీసన్ వెంటనే వెళ్లి ఆ డబ్బు తెచ్చుకున్నాడు.చూసారా లక్ వర్షం లో ఎలా వెతుక్కుంటూ వచ్చి లక్కలాగా అతుక్కుపోయిందో.. అదే మని అదృష్టం వరిస్తే ..ఎవరూ ఆపలేరు అని పెద్దలు ఊరికే అంటారా..హ్యారీసన్ విషయంలో అదే జరిగింది.