ఎండల ఎఫెక్ట్ : లారీలో మంటలు

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 11:49 AM IST
ఎండల ఎఫెక్ట్ : లారీలో మంటలు

ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బతో ప్రాణలు వదులుతున్నారు. ఎండల ఎఫెక్ట్ వాహనాలపై పడింది. ఎండ వేడిమికి వాహనాల్లో మంటలు పుడుతున్నాయి.

సంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ పై ఇలాంటి ఘటనే జరిగింది. ఓ లారీలో (AP 16 W 4159) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎండ వేడిమికి ఒక్కసారిగా క్యాబిన్ లో మంటలు వచ్చాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ లారీలోంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సంగారెడ్డిలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఎండలకు పరిశ్రమలు తోడు కావడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

కొన్ని రోజులుగా సంగారెడ్డిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ వాహనంలో మంటలు పుడతాయో అనే భయంతో టెన్షన్ పడుతున్నారు. జర్నీ చెయ్యాలంటే హడలిపోతున్నారు. ఎండల తీవత్ర ఎక్కువగా ఉన్న సమయంలో జర్నీలు చెయ్యకపోవడమే బెటర్ అని అధికారులు చెబుతున్నారు.