న్యాయం చేయండి : CEC ని కలిసిన సునీత

  • Published By: madhu ,Published On : March 22, 2019 / 09:52 AM IST
న్యాయం చేయండి : CEC ని కలిసిన సునీత

తన తండ్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్‌ టైమ్‌లో ఏపీ ప్రభుత్వం తప్పుడు వార్తను ప్రచారం చేస్తుందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థను మార్చాలని ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎవరి ప్రమేయం లేకుండా తన తండ్రి హత్య కేసు విచారణ జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే తప్పుడు ఆరోపణలు చేస్తుంటే.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిట్‌ కేసును ఎలా దర్యాప్తు చేస్తుందని సునీత ప్రశ్నించారు.
Read Also : వీధుల్లో కొట్టుకున్నారు : ఉండిలో టీడీపీ – వైసీపీ రాళ్ల దాడులు

ఇదిలా ఉంటే వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. పులివెందులకు చెందిన దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి, అలియాస్‌ దొండ్లవాడ శంకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు  సిట్‌ అధికారులు. ఈ హత్య కేసులో ఇప్పటికే 30 మందికిపైగా అనుమానితులను విచారించిన సిట్‌.. మార్చి 25వ తేదీ సోమవారం నిందితులను మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
Read Also : పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల వివరాలు ఇవే!