గుండ్ల వెనుక కథ : భార్య సర్పంచ్‌‌‌గా గెలిచిందని 101 మందికి తలనీలాలు

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 08:20 AM IST
గుండ్ల వెనుక కథ : భార్య సర్పంచ్‌‌‌గా గెలిచిందని 101 మందికి తలనీలాలు

ఆ ఊళ్లోని కొన్ని ఇళ్లలో చూస్తే ఒక్కొక్కరు గుండుతో దర్శనమిస్తుంటారు. మొత్తం 101 మంది గుండ్లతో కనిపిస్తున్నారు. వీరందరూ ఎందుకు గుండ్లు చేయించుకున్నారు. ఏంటా గుండ్ల కథ తెలుసుకోవాలంటే ఇది చదవండి…

మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం అప్పాజిపల్లిలో ఇటీవలే జరిగే పంచాయతీ ఎన్నికల్లో స్వరూప శ్రీనివాస్ బరిలో నిలిచారు. ఈమెకు కాంగ్రెస్ మద్దతునిచ్చింది. తన భార్య స్వరూప విజయం సాధించాలంటూ భర్త శ్రీనివాస్ పలు కోర్కెలు కోరుకున్నారు. తన భార్య గెలిస్తే తిరుపతి కొండకు వచ్చి శ్రీ వారిని దర్శించుకుంటానని, తనకు మద్దతు తెలియచేసే వారిని కూడా తీసుకొచ్చి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. ఫలితాలు వచ్చేశాయి. స్వరూప శ్రీనివాస్ గెలిచింది. 

దీనితో కోర్కెలను తీర్చుకొనేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యాడు. రెండు ఆర్టీసీ బస్సుల్లో ఎన్నికల్లో మద్దతునిచ్చిన వారిని తీసుకెళ్లారు. శ్రీ వారిని దర్శించుకున్న అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు. 101 మంది తలనీలాలు సమర్పించుకున్నారని…ఆడవారు ఐదు కత్తెరలు ఇచ్చారని స్వరూప మీడియాకు తెలిపారు. అక్కడి నుండి శ్రీకాళాహస్తి..ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చినట్లు పేర్కొన్నారు. గదండి సంగతి. 

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే