ఏర్పాట్లపై ఆసక్తి : నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు

మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 08:53 AM IST
ఏర్పాట్లపై ఆసక్తి : నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు

మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.

దేశవ్యాప్తంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం ఆసక్తి రేపుతోంది. ఇక్కడి నుంచి 185 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. అందరూ రైతులే. పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్ దాఖలు చేశారు. 245 నామినేషన్లు దాఖలు అయితే.. పరిశీలన, ఉప సంహకరణ తర్వాత 185 మంది ఫైనల్ అయ్యారు. 100కి పైగా అభ్యర్థులు పోటీ ఉంటే.. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి కారణం.. ఈవీఎం 64 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. 

185 మంది అభ్యర్థులు అంటే.. భారీ ఎత్తున బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతే కాదు.. ప్రతి ఒక్క అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్ బూత్ లో ఉంటారు. అంటే ప్రతి పోలింగ్ బూత్ లో 185 మంది ఏజెంట్లతోపాటు.. పోలింగ్ సిబ్బందికి ఏర్పాట్లు చేయాలి. ఈ లెక్కలు వేసుకుంటే.. ప్రతి పోలింగ్ బూత్.. ఓ ఫంక్షన్ హాలుగా మారనుంది. 185 మందితోపాటు మరో 10 మంది పోలింగ్ సిబ్బంది.. మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఇప్పటి వరకు పోలింగ్ బూత్ లో 15, 20 మందికి మాత్రమే ఏర్పాట్లు చేస్తూ వస్తారు. ఇప్పుడు ఒక్కో పోలింగ్ బూత్ 200 మందితో ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.