ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. రెండో విడత ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 04:06 PM IST
ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. రెండో విడత ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. శనివారం (జనవరి 18, 2020) జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెండో విడత ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్‌ ఈ.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి బాధ్యులుగా పరిగణిస్తూ నలుగురు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 

ఎన్నికల శిక్షణకు హాజరుకాని రజిని ఎల్ పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంతటి, నస్రీన్ ముభాషీర్, ఎస్ ఏ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మాజీపేట్, సి.మాధవి మోడల్ స్కూల్ వెల్దండ, కె మంజుల మోడల్ స్కూల్ వెల్దండకు సంబంధించిన ఈ నలుగురు ఉపాధ్యాయులను ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కలెక్టర్‌ వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.