తాడిపత్రి రూరల్ సీఐ బదిలీ

  • Published By: madhu ,Published On : April 7, 2019 / 11:06 AM IST
తాడిపత్రి రూరల్ సీఐ బదిలీ

ఎన్నికల వేళ నిర్లక్ష్యంగా ఉంటున్నఅధికారులపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సీరియస్ అవుతున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ కంప్లయింట్స్ వస్తున్నాయి ఈసీకి. దీనితో ఎన్నికల అధికారులు వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మదనపల్లె టూ టౌన్ సీఐ సురేష్ కుమార్‌‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీఐని బదిలీ చేసింది.

అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐ డి.వి. నారాయణరెడ్డిని ఈసీ బదిలీ చేసింది. హోం శాఖ సిఫార్సులతో సీఐ నారాయణరెడ్డిని బదిలీ చేసినట్లు సమాచారం. తాడిపత్రి రూరల్ సీఐగా సీసీఎస్ సీఐ శరత్ చంద్రకు ఈసీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల విధుల నుండి తొలగిస్తూ, నాన్ ఎలక్షన్ పోస్టులో నియమిస్తున్నట్లు ఈసీ గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు.

ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలిగారు. వారి వారసులను బరిలోకి దించారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా, జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.