భగ్గుమన్న రాజకీయ కక్షలు : టీడీపీ కార్యకర్తను నరికి చంపారు

నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. అనంతసాగరం మండలం మినగల్లులో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత

  • Edited By: veegamteam , September 13, 2019 / 03:48 AM IST
భగ్గుమన్న రాజకీయ కక్షలు : టీడీపీ కార్యకర్తను నరికి చంపారు

నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. అనంతసాగరం మండలం మినగల్లులో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత

నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. అనంతసాగరం మండలం మినగల్లులో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత వెంగయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు భయాందోళన చెందారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. ముందు జాగ్రత్తగా అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

అసలే టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ వాళ్లపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. పలువురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని అంటున్నారు. వైసీపీ బాధితులను ఆదుకోవడం కోసం పోరుబాట పట్టారు. ఛలో ఆత్మకూరుకి పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని అంటున్నారు. అటు వైసీపీ వాళ్లు కూడా ఎదురుదాడికి దిగారు. టీడీపీ వాళ్లే తమ వాళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వారు కూడా ఛలో ఆత్మకూరుకి పిలుపునిచ్చారు. దీంతో పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడేం జరుగుతుందోనని అంతా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన.. ఉద్రిక్తతలను మరింత పెంచాయి.