ఇసుక కొరతపై టీడీపీ ధర్నాలు

  • Published By: madhu ,Published On : August 30, 2019 / 01:14 AM IST
ఇసుక కొరతపై టీడీపీ ధర్నాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేపట్టనుంది. ఈ మేరకు టీడీపీ శ్రేణులు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ధర్నాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు ట్విట్టర్‌ ద్వారా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సిమెంట్‌ కన్నా ఇసుక ధర పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. 20 లక్షల మంది సెంట్రింగ్‌, కార్పెంటరీ, తాపీలాంటి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఫైర్‌ అయ్యారు.

32 రకాల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా టీడీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని ఆయన కోరారు. మంగళగిరిలో జరిగే ధర్నాలో నారా లోకేష్ పాల్గొననున్నారు. 

Read More : కోడెల కుటుంబానికి బిగ్ షాక్
రైతులపై కూడా ఆయన స్పందించారు. విత్తనాల కోసం ఇంకెంతమంది రైతులు బలికావాలి అంటూ ప్రశ్నించారు. విత్తన పంపిణీ చేతకాదు..విద్యుత్ ఇవ్వడం చేతకాదు..వరదలొస్తే..నీటి నిర్వాహణ చేతకాక రైతు పొలాలను ముంచారు అంటూ విమర్శించారు. అన్నదాతకు ఏమిటీ కష్టాలు..రైతు దినోత్సవం జరిపి మీరు సాధించింది ఏమిటీ అంటూ ట్వీట్‌లో తెలిపారు. రైతు ప్రాణమంటే లెక్కలేదా..బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు బాబు.