కూల్చేస్తే.. కూల్చేసుకోండి : చంద్రబాబు ఇంటికి నోటీసులపై టీడీపీ వెర్షన్

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 05:30 AM IST
కూల్చేస్తే.. కూల్చేసుకోండి : చంద్రబాబు ఇంటికి నోటీసులపై టీడీపీ వెర్షన్

బాబు ఇల్లు కాదు..కూల్చేస్తే కూల్చేసుకోండి…అంటూ టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ వ్యాఖ్యానించారు. ఓనర్ చట్ట ప్రకారం వెళుతున్నారు..మాకేం సంబంధం ఏదైనా ఉంటే..ఓనర్ రమేశ్ వచ్చి తమతో మాట్లాడుతాడు..అంటూ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు 26 నివాసాలకు నోటీసులు అంటించారు సీఆర్డీఏ అధికారులు. శనివారం( సెప్టెంబర్ 21,2019) టీడీపీ నేత అనురాధతో 10tv ముచ్చటించింది.

యజమాని రమేశ్‌తో మాట్లాడతామన్నారు. ఏదో బాబు ఇల్లు అయినట్లు..మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముందని అనురాధ ప్రశ్నించారు. వైసీపీ డమ్మీ క్యాండెట్లుగా అభివర్ణించారు. వైసీపీ వారికి ఏం పని లేదు..ప్రజలకు సంబంధించిన విషయాలను పట్టించుకోవడం లేదని అర్థమౌతోందన్నారు. గోదావరి నదిలో బోటు మునిగితే..సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారని ఎద్దేవా చేశారు అనురాధ. 

చంద్రబాబు ఇంటికి మరోసారి కూల్చివేత నోటీసులు అంటించింది CRDA. లింగమనేని రమేశ్ పేరిట ఈ నోటీసులున్నాయి. అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారందరూ వారం రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఆర్డీఏ అధికారులు. లేని పక్షంలో తామే కూల్చేస్తామన్నారు. వరదల సమయంలో బాబు నివాసానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, డ్రెస్సింగ్ రూమ్ కూల్చాలని నోటీసులో తెలిపింది. అయితే నిర్మాణ సమయానికి CRDA ఏర్పడ లేదని అంటున్నారు లింగమనేని రమేశ్.
Read More : వారం డెడ్ లైన్ : చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాల్సిందే