అది బోస్టన్ కమిటీ కాదు బోగస్ కమిటీ : బోండా ఉమ

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 07:42 AM IST
అది బోస్టన్ కమిటీ కాదు బోగస్ కమిటీ : బోండా ఉమ

ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బీసీజీ) నివేదిక ఈరోజు  ప్రభుత్వానికి చేరనుంది. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ బోస్టన్ కమిటీపై తీవ్ర విమర్శలు చేశారు. అది బోస్టన్ కమిటీ కాదు ఓ బోగస్ కమిటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ప్రాంతీయ  కక్షలతోనే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నారనీ..అమరావతిలో నిర్మానాలు దాదాపు పూర్తయ్యాయని కానీ కుట్ర పూరితంగా ఆలోచిస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రాంతాలమధ్య విభేధాలు సృష్టించటానికి..స్వప్రయోజనాల కోసం రాజధానిని తరలించే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.  

రాజధానుల నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఏక పక్షంగా వ్యవహరించారని ప్రజల్ని మోసం చేశారనీ ఆరోపించారు. విశాఖలో భారీ ఎత్తున భూముల్ని కొన్న వైసీపీ నేతలకు..తద్వారా సీఎం జగన్ లబ్ది పొందేందుకు రాజధానికి తరలిస్తూ..టీడీపీ నేతలపై ఇన్ సైడర్ ట్రేడంగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడంగ్ ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజల్ని తప్పు దోవ పట్టించేందుకు వైసీపీ నేతలు ఉన్నారనీ..ఇన్ సైడర్ ట్రేడంగ్ కు సంబంధించి ఆధారాలను చూపించటంలో కూడా వైసీపీ నేతలు ఫెయిల్ అయ్యారనీ అవి ఉత్తి ఆరోపణలు తప్ప వాస్తవాలు లేవన్నారు. ఉంటే నిరూపించి ఇన్ సైడర్ ట్రేడంగ్ కు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఇన్ సైడర్ ట్రేడంగ్ వాస్తవం అయితే వారిపై చర్యలు తీసుకోవటం మానేసి..వట్టి మాటలతో మోసం చేస్తున్నారనీ..రాజధాని తరలింపుకు జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ అంటూ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు. న్యూయార్క్ అవతల బోస్టన్ నగరంలో ఉన్న సంస్థ బోస్టన్ సంస్థ అని… అమెరికాలో ఉన్న బోస్టన్ సంస్థకు అసలు అమరావతి మీద అవగాహన ఉంటుందా అని ప్రశ్నించారు. అమరావతిలో ఏమేమీ ఉన్నాయో, ప్రజలు.. వారి విధానాల గురించి ఏదైన అవగాహన ఉందా అని నిలదీశారు. జీఎన్ రావు ఇచ్చిన రిపోర్ట్‌నే బోస్టన్ కమిటీ ఇస్తుందని వారు అన్నారు. హైపర్ కమిటీ కూడా ఓ బోగస్ కమిటీ అని బోండా ఉమ విమర్శించారు.