వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటి ? : యనమల

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటి ? : యనమల

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.

ఏపీ శాసనమండలిలో టీడీపీ పట్టు నిలుపుకుంది. ముందు నుంచి చెప్తున్నట్లుగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంలో టీడీపీ సక్సెస్ అయింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. శాసన మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారు. తనకున్న విచక్షణాదికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు. ఛైర్మన్ రూలింగ్ పై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఛైర్మన్ తీరుని తప్పుబట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రభుత్వ పాలసీని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై జరిగిన ఓటింగ్ లో తాము గెలిచామని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వం బుల్ డోజ్ చేసుకుంటారేమో కానీ మండలిలో ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బిల్లులను అప్రూవ్ చేసేసుకుని ఎలా వెళ్తారని నిలదీశారు.

బిల్లులో సవరణల కోరాల్సిన అసవరం లేదన్నారు. రూల్స్ ప్రకారమే సెలెక్ట్ కమిటీకి పంపామని తెలిపారు. బిల్లులను సెలెక్ట్ కమిటీ లోతుగా అధ్యయనం చేస్తుందన్నారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేంటని ప్రశ్నించారు. రూల్ 154 ప్రకారం మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని బిల్లులను వ్యతిరేకించామని చెప్పారు.

ఛైర్మన్ పై దాడి చేసే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పేపర్లు చించేశారు..కొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. లోకేష్ పై మంత్రి అనిల్ దాడి చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. మండలి ఛైర్మన్ కు విచక్షణాధికారం ఉంటుందన్నారు. ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు ఉండొచ్చు అన్నారు. కానీ ఛైర్మన్ నిర్ణయమే ఫైనల్ స్పష్టం చేశారు. అసెంబ్లీలోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టే విషయంలో రూల్స్ పాటించలేదన్నారు. అసెంబ్లీలో స్పీకర్ కు రూల్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.