ఆఖరి అస్త్రం : బాబు దీక్ష లేదా నిరసన

  • Edited By: madhu , January 26, 2019 / 10:58 AM IST
ఆఖరి అస్త్రం : బాబు దీక్ష లేదా నిరసన

విజయవాడ : కేంద్రంపై బాబు ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి సన్నద్దమౌతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రానితో సై..అంటే సై అనే ధోరణిలో వెళుతున్న బాబు…మరోసారి దీక్ష లేదా నిరసన చేయడానికి రెడీ అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని బాబు యోచిస్తున్నారు. అందులో భాగంగా పార్లమెంట్ సమావేశాల లాస్ట్ డే…సందర్భంగా నిరసన చేయాలని అనుకుంటున్నట్లు…అయితే..ఎలాంటి నిరసన చేయాలో మీరే చెప్పాలంటూ పార్టీ ఎంపీలను బాబు అడిగారు. 

జనవరి 26వ తేదీ శనివారం టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు బాబు దిశా..నిర్దేశం చేశారు. విభజన హామీల అమలు చేయాలని…
తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని గతంలో కూడా దీక్ష చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి మాత్రం దీక్ష లేదా నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బాబు ఎంపీలతో తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి నిరసన వ్యక్తం చేయాలో చెప్పాలన్నారు. ఎప్పటికప్పుడు సమయస్పూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని..పార్లమెంట్‌లో ఆందోళన చేస్తే సస్పెండ్ కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని బాబు ఎంపీలకు సూచించారు. 

ఏ విధంగా నిరసన ఉండాలనేది మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. మరి బాబు దీక్ష చేస్తారా ? నిరసన చేస్తారా ? ఇందుకు జాతీయ నేతలను ఆహ్వానిస్తారా ? ఇతర వివరాలు రానున్న రోజుల్లో వెల్లడికానున్నాయి.