తెలుగుదేశం పార్టీ అఫిషియల్ పేజ్‌కి ఏమయ్యింది?

  • Edited By: vamsi , December 18, 2019 / 05:24 AM IST
తెలుగుదేశం పార్టీ అఫిషియల్ పేజ్‌కి ఏమయ్యింది?
ad

ప్రతి పొలిటికల్ పార్టీకి అఫిషియల్‌గా ప్రతి సోషల్ మీడియాలో పేజ్‌లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి కూడా సోషల్ మీడియాలో అకౌంట్‌లు ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా తెలుగుదేశం పార్టీ ఫేస్‌బుక్ రద్దు చేసింది. ఈ పేజ్‌ని ఫేస్‌బుక్ నుంచి తొలిగించింది. తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ఫేస్‌బుక్‌లో పేజ్ కనపడకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో లేటెస్ట్‌గా పేజ్ ఎందుకు పొయ్యింది అనే విషయమై ఆ పార్టీ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ‘వైసీపీ నేతల కౄరత్వాన్ని ఫేస్ బుక్ తట్టుకోలేకపోయింది. టీడీపీ నాయకుడు మంజుల వడ్డె సుబ్బారావును వైసీపీ నేతలు హత్య చేసిన దృశ్యాలను పోస్టు చేసినందుకు తెదేపా అధికారిక ఫేస్ బుక్ పేజీని తాత్కాలికంగా నిలిపివేసింది. పేజీ రికవరీ చర్యలు జరుగుతున్నాయి. తెదేపా అభిమానులు గ్రహించగలరు’ అంటూ ఓ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. 

నిన్న(17 డిసెంబర్ 2019) కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత హత్య జరగగా.. ఆ హత్యకు సంబంధించిన వీడియోని టీడీపీ ఫేస్‌బుక్ పేజ్‌లో డైరెక్ట్‌గా పోస్ట్ చేసింది. దీంతో ఫేస్‌బుక్ కమ్యునిటీ గైడ్ లైన్స్ ప్రకారం పేజ్ ని తొలగించింది ఫేస్ బుక్.