కొత్త చట్టం: ఆడవాళ్లు పొట్టి బట్టలు వేసుకుంటే జరిమానా..

  • Published By: nagamani ,Published On : September 19, 2020 / 03:33 PM IST
కొత్త చట్టం: ఆడవాళ్లు పొట్టి బట్టలు వేసుకుంటే జరిమానా..

యువతులు..మహిళలు పొట్టి పొట్టి బట్టలు వేసుకోకూడదనీ..అలా వేసుకునేవారికి జరిమానా విధించేందుకు కంబోడియా ప్రభుత్వం సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి ఓ చట్టం ముసాయిదా సిద్ధం చేస్తోంది.దీనిపై మహిళలు మండిపడుతున్నారు. ఇది మహిళ స్వేచ్ఛపై విధించే ఆంక్షలని మండిపడుతున్నారు. విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చాలామంది మహిళలు నిరసనలు తెలుపుతున్నారు.




అంతేకాదు మోలికా అనే 18 ఏళ్ల యువతి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ మొదలుపెట్టారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను, సభ్యతను పరిరక్షించేందుకు ఈ చట్టాన్ని తెస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటోంది. దీనిపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

ఈ చట్టం ఆమోదం పొందితే.. కంబోడియాలో శరీరం ఎక్కువగా కనిపించేలా మహిళలు ‘పొట్టి’ బట్టలు వేసుకోవడంపై నిషేధం అమలవుతుంది. అటు, పురుషులు కూడా అర్ధనగ్నంగా గానీ..ఛాతీపై దుస్తులు లేకుండా తిరగకూడదు. ప్రభుత్వ తీరుపై ఆడాళ్లు ఆన్‌లైన్‌లో పిటిషన్ మొదలుపెట్టారు. సౌకర్యంగా అనిపించే దుస్తులను వేసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని యువతులు..మహిళలు ప్రశ్నిస్తున్నారు.




నిసనల్లో భాగంగా దేశంలోని కొందరు మహిళలు, యువతులు స్కర్టులు, షార్టులు, స్విమ్‌వేర్ ధరించి ఉన్నప్పటి ఫొటోలను, చట్టంపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ చట్టం పేదలను మరింత అణగదొక్కి, సమాజంలో అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉందని కూడా కొందరు మహిళలు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే, కంబోడియాలో ‘శరీరం ఎక్కువగా కనిపించేలా’, మహిళలు ‘పొట్టి’ బట్టలు వేసుకోవడంపై నిషేధం అమలవుతుంది. పురుషులు కూడా అర్ధనగ్నంగా (ఛాతీపై దుస్తులు లేకుండా) తిరగకూడదు. సంస్కృతి, సంప్రదాయాలను, సభ్యతను పరిరక్షించేందుకు ఈ చట్టాన్ని తెస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటోంది.



కానీ, ఈ చట్టంలోని నిబంధనలను చాలా మంది తప్పుపడుతున్నారు. ఈ చట్టాన్ని మహిళలపై జరుగుతున్న దాడిగా మోలిక అభివర్ణిస్తున్నారు. కాగా..ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా మోలిక గత ఆగస్టులో ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే 21 వేల మందికిపైగా సంతకాలు చేశారు.

ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా కంబోడియాలో చాలా మంది మహిళలు తమ గళాలను వినిపిస్తున్నారు. స్కర్టులు, షార్టులు, స్విమ్‌వేర్ ధరించి ఉన్నప్పటి ఫొటోలను, చట్టంపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘దీనికి మాకు జరిమానా వేస్తారా?’ అని ప్రశ్నిస్తూ ‘#mybodymychoice’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై మోలిక మాట్లాడుతూ..ఆడవాళ్లు మగవాళ్లకంటే కింది స్థాయి వారని అనుకుంటున్నారనీ..మహిళలు అణిగిమణిగి ఉండాలన్న సంప్రదాయ భావనలే ఈ పరిస్థితికి కారణమని అన్నారు.




గత కొన్నేళ్లుగా ప్రభుత్వం మహిళల వస్త్రధారణను లక్ష్యంగా చేసుకుంటున్న ప్రభుత్వం సింగర్స్, యాక్టర్స్ ‘అనుచిత’ దుస్తుల్లో ప్రదర్శనలు ఇవ్వడంపై నిషేధం విధించింది. అంతేకాదు..గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో బట్టల వ్యాపారం చేస్తున్న ఓ మహిళ‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

మహిళలు ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని… లైంగిక వేధింపులను, మహిళలపై నేరాలను ప్రేరేపిస్తోందని కంబోడియా ప్రధాని హన్ సెన్ ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు.




కంబోడియాలో జనాలు బాధితులనే నిందించే తీరుపై చర్చ జరగాల్సిన అవసరముందని అయ్లిన్ లిమ్ 18 ఏళ్ల యువతి అన్నారు. తాను కొత్త చట్టానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగమయ్యాయని తెలిపారు. ఈ చట్టం ఆమోదం పొందితే, లైంగిక వేధింపులకు పాల్పడేవారిది తప్పు కాదన్న భావన సమాజంలోపెరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల వస్త్రధారణపై ఇటువంటి చట్టం సరైంది కాదని..సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

కాగా..ప్రభుత్వంలోని మంత్రిత్వశాఖలు..జాతీయ అసెంబ్లీ ఆమోదిస్తే ఈ చట్టం వచ్చే ఏడాది అమల్లోకి వస్తుంది. దీనిపై కంబోడియా అంతర్గత మంత్రి ఒవుక్ కిమ్లేఖ్‌ మాట్లాడుతూ..‘ఇది చట్టం తొలి ముసాయిదా’ మాత్రమేనని ఒకే ఒక్కమాట చెప్పి మీడియానుంచి తప్పించుకున్నారు. అంతకు మించి ఇక సమాధానం చెప్పటానికి నిరాకరించారు.