రాజమండ్రిలో యువకుల వీరంగం : హెడ్ కానిస్టేబుల్ పై దాడి 

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 04:39 AM IST
రాజమండ్రిలో యువకుల వీరంగం : హెడ్ కానిస్టేబుల్ పై దాడి 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకులు వీరంగం సృష్టించారు. ఆనంద్ నగర్ లో ముగ్గురు యువకులు ఓ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఒకే బైక్ పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటు వెళ్తున్న ముగ్గురు యువకుల వాహనాన్ని కానిస్టేబుల్ ఫోటో తీసారు. దీంతో రెచ్చిపోయిన యువకులు కానిస్టేబుల్ పై దాడికి దిగారు. 

వివారాలు..రాజమండ్రిలోని సీతానగరం పరిధిలో  హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఆనంద్ నగర్ వైపుగా వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ట్రిపుల్ రైడింగ్ తో ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన  ముగ్గురు యువకులు నాగేశ్వరరావు బైకు ఢీకొట్టారు. తరువాత కూడా వారు ఆగకుండా ముందుకు దూసుకుపోయారు. దీంతో నాగేశ్వర రావు బండి ఆపి యువకుల వాహనాన్ని నాగేశ్వర రావు ఫోటో తీశారు. ఫోటోలు తీయటం గమనించిన ముగ్గురు యువకులు తిరిగి వెనక్కి వచ్చారు. ఫోటోను ఎందుకు తీసావంటూ దురుసుగా నాగేశ్వరరావుని అడిగారు.

ట్రిపుల్ రైడింగ్..పైగా ర్యాష్ డ్రైవింగ్ చేశారు కాబట్టి ఫోటో తీసానని చెప్పాడు నాగేశ్వరావు. దీంతో సదరు యువకులు రెచ్చిపోయారు. మా ఫోటోలే తీస్తావా అంటూ దుర్భాషలాడుతూ ..తీసిన ఫోటోలను డిలీట్ చేయాలని హుంకరించారు. కుదరదనీ చెప్పటంతో ముగ్గురు కలిసి కానిస్టేబుల్ పై దాడికి దిగారు.

నాగేశ్వరరావు షర్టును చించేశారు. కింద పడేసి కాలితో తన్నారు. పిడి గుద్దులు గుద్దారు. నానా దుర్భాషలాడారు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. దీన్ని గమనించిన స్థానికులు యువకులను అడ్డుకున్నారు. వారిపై కూడా యువకులు దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. 

దీంతో కానిస్టేబుల్ నాగేశ్వర రావు వెంటనే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే ఘనటాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇది గమనించిన యువకులు ముగ్గురూ పారిపోవటానికియ యత్నించారు.కానీ వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. కానిస్టేబుల్ ను కొట్టటం..ట్రిపుల్ రైడింగ్..ర్యాష్ డ్రైవింగ్ లకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.