కిక్కు దిగుతుంది : తాగిన వారికి రూ. 10 వేలు..అమ్మితే లక్ష ఫైన్

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 07:11 AM IST
కిక్కు దిగుతుంది : తాగిన వారికి రూ. 10 వేలు..అమ్మితే లక్ష ఫైన్

మద్యపానంపై మహిళలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కిక్కు దిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తాగడం వల్ల కుటుంబాలు సర్వనాశనమౌతున్నాయని, ఆర్థికంగా చితికిపోతున్న తమ బతుకులను తామే బాగు చేసుకోవాలని అనుకుని ఓ కఠిన నిర్ణయానికి వచ్చారు. తాగిన వారికి రూ. 10 వేలు, అమ్మిన వారికి రూ. లక్ష జరిమాన..అంటూ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఈ విధంగా తీర్మానం చేసింది. మహిళలతో పంచాయతీ ఇటీవలే సమావేశం నిర్వహించింది. గ్రామ సర్పంచ్ టి.లక్ష్మీ తీర్మానాన్ని ఆమోదించారు. తిమ్మాపూర్ గ్రామంలో 1500 కుటుంబాలున్నట్లు..అధిక సంఖ్యలో వ్యవసాయంపైనే ఆధార పడి జీవిస్తున్నాయని సర్పంచ్ వెల్లడించారు. అయితే..మద్యం సంసారాల్లో చిచ్చు రేపుతోందని, ఆర్థికంగా సమస్యలు సృష్టించడంతో పాటు..ప్రాణాలు కూడా పోయాయని..లక్ష్మీ వెల్లడించారు.

రోజుకు రూ. 500 సంపాదిస్తే..అందులో అధికంగా మద్యానికే ఖర్చు పెడుతున్నారని తెలిపారు. కుటుంబాలను..పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారని, అంతేగాకుండా..ఇబ్బందులు సృష్టిస్తున్నారని తెలిపారు. తిమ్మపూర్‌లో వైన్ షాప్ లేదని..మందు కావాలంటే..ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందన్నారు. కొంతమంది కిరాణ షాపుల వారు అదనంగా రూ. 10 వసూలు చేసి మద్యాన్ని విక్రయిస్తున్నారని వెల్లడించింది. నాలుగు షాపుల వారు ఇలాంటి పనులు చేస్తున్నట్లు..వీరికి హెచ్చరికలు చేసినా వినిపించుకోలేదన్నారు. దీంతో మార్పు రావాలని కోరుకుని..మహిళలంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 

తీర్మానం ఆమోదించిన అనంతరం మేలు జరుగుతోందని..మద్యం తాగడం..కానీ..విక్రయించడం లేదన్నారు సర్పంచ్. అయినా..కూడా తమ తీర్మానానికి వ్యతిరేకించి మద్యం విక్రయించినా..సేవించినా.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి ఆమోదం తెలిపినట్లు జగదేవ్ పూర్ తహశీల్దార్ వెల్లడించారు. ఇలాంటి నిర్ణయాలు అవసరమన్నారు.
Read More : కావేరీ పిలుస్తోంది : లక్ష మొక్కలు నాటుదాం అంటున్న సమంత