శ్రీవారి భక్తులపై మరింత భారం : ధరలు పెరిగాయి

తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి

  • Edited By: veegamteam , November 7, 2019 / 10:03 AM IST
శ్రీవారి భక్తులపై మరింత భారం : ధరలు పెరిగాయి

తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి

తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కౌస్తుభం, పాంచజన్యంలో గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెంచారు. పెంచిన ధరలు గురువారం(నవంబర్ 7,2019) నుంచే అమల్లోకి వచ్చాయి.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3వేల వరకు వసతి సదుపాయం ఉంది. ఆన్ లైన్, ఈ-దర్శన్ ల ద్వారా ప్రస్తుతం రూ.100, రూ.500, రూ.600, రూ.999, రూ.1500 వసతిని మాత్రమే కేటాయించేవారు. వీటిలో రూ.100, రూ.500, రూ.600 సాధారణ వసతి కాగా.. రూ.999, రూ.1500 ఏసీ సదుపాయంతో కూడినవి.

తిరుమల వెళ్లే భక్తుల్లో ఎక్కువమంది రూ.100 గదుల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతారు. అయితే రూ.100 వసతి గదులు చాలా తక్కువగా కేటాయిస్తున్నారు. దీంతో అవి దొరకని పరిస్థితి ఉంది. అవి దొరక్కపోవడంతో రూ.500, రూ.600 వసతిని పొందేవారు. మధ్య, ఎగువ మధ్య తరగతికి ఇవి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి ధరలు పెంచడం ఇబ్బందిగా మారనుంది.

తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచినా తిరుపతిలో మాత్రం ఎలాంటి మార్పు లేదని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీనివాసం సాధారణ గది రూ.200, ఏసీ రూ.400, డీలక్స్ ఏసీ రూ.600, మాధవంలో ఏసీ రూ.800, డీలక్స్ ఏసీ రూ.1000, తిరుచానూర్ (పద్మావతి అమ్మవారి ఆలయం)లో ఏసీ రూ.300, సాధారణ గది రూ.100 చొప్పున ఉన్నాయి.