గణేష్ నిమజ్జనంలో విషాదం : చెరువులో మునిగి ముగ్గురు మృతి

  • Edited By: veegamteam , September 8, 2019 / 02:31 AM IST
గణేష్ నిమజ్జనంలో విషాదం : చెరువులో మునిగి ముగ్గురు మృతి
ad

కృష్ణా జిల్లాలో గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఎ.కొండూరు తండాలో వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. 

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. మైలవరం సీఐ… ధైర్యంగా చెరువులోకి దిగి మూడు మృతదేహాలను వెలికితీశాడు. పోస్టుమార్టం కోసం మైలవరం ఆస్పత్రికి తరలించారు. 

మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికొచ్చిన కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముగ్గురు యువకులు మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.