చెన్నకేశవస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 06:29 AM IST
చెన్నకేశవస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

దేవాలయాల్లో గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు తవ్వకాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దేవాలయంలో  మరోసారి దేవస్థానంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రాయలగండి చెన్నకేశవస్వామి ఆలయంలోని రెండు గదుల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో భాగంగా దుండగులు ఆలయం ధ్వజ స్థంభం పక్కన ఉన్న దిమ్మెను ధ్వంసం చేశారు. 

నల్లమల ప్రాంతంలో సువర్ణ గిరి గుట్టగా పేరుగాంచిన రాయల గండి లక్ష్మి చెన్నకేశవస్వామి దేవాలయం గుప్త నిధుల ముఠా తవ్వకాలతో ధ్వంసమవుతోంది. దళితులు పూజారులుగా ఉన్న ఏకైక దేవాలయం  చెన్నకేశవస్వామి ఆలయం. ప్రతి సంవత్సరం మార్చిలో పలు  గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా దేవాలయంలో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఆలయం ధ్వజ స్థంభం పక్కన ఉన్న దిమ్మెను ధ్వంసం చేశారు.  కాగా..గతం కూడా ఈ దేవాలయంలో తవ్వకాలు జరిపి బంగారాన్ని తీసుకెళ్లారన్న ప్రచారం జరిగింది.