పోలింగ్‌లో లోపాలన్నాయి : TRS అభ్యర్థి కవిత

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 03:27 AM IST
పోలింగ్‌లో లోపాలన్నాయి : TRS అభ్యర్థి కవిత

ఎన్నికల పోలింగ్‌లో లోపాలున్నాయని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత తెలిపారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి కవిత దంపతులు నవీపేట మండలంలోని పోతంగల్‌ గ్రామానికి చేరుకున్నారు. అందరిలాగానే క్యూ లైన్‌‌లో వేచి ఉన్నారు. అయితే ఆమె వెళ్లేసరికి ఈవీఎం పనిచేయలేదు. దీనిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

చాలా లోపాలున్నాయని కనిపించిదన్నారు. ఈసీకి తాము ఎక్కువ సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఎంట్రీ ఎగ్జిట్ పెట్టడం లేదని, ఈవీఎంలకు నెంబరింగ్ లేదన్నారు. నంబరింగ్ విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వలేదని సిబ్బంది తెలియచేసినట్లు వెల్లడించారు. దాదాపు గంట లేట్‌గా పోలింగ్ స్టార్ట్ అయ్యిందన్నారు. నిజామాబాద్ జిల్లాపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. తాము ఏడు గంటల వరకు టైం కొనసాగించాలని కోరినట్లు..అయితే సాయంత్రం 6గంటల వరకు అనుమతినించినట్లు కవిత తెలిపారు.