టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం : ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని

  • Edited By: veegamteam , November 12, 2019 / 05:07 AM IST
టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం : ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు వరం ప్రకటించింది. ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75శాతం రిజర్వేషన్ కల్పించారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో లోకల్ రిజర్వేషన్ వర్తించనుంది.

లోకల్ రిజర్వేషన్ తీర్మానాన్ని టీటీడీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనుమతి కోసం ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

టీటీడీ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల చిత్తూరు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం అంటున్నారు. స్థానికులకు న్యాయం చేసినట్టు అవుతుందన్నారు. నిరుద్యోగులకు కొంతైనా ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు.