శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల 

తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనున్నారు.

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల 

తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి 6737 ఆర్జిత సేవాల టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. జన్ రల్ కేటగిరీలో 56,325, లక్కీడిప్ లో 11,412 టికెట్లను కేటాయిస్తామని ఆలయ ఈవో సింఘాల్ తెలిపారు.

వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలను నియంత్రించామని తెలిపారు. కాగా ఏప్రిల్ నెలలో శ్రీవారిని 21,96 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. మే 13 నుంచి 15 వరకు శ్రీవారి ఆలయంలో పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 

బంగారం తరలింపు విషయంలో ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకునే అంశాన్ని పాలక మండలి నిర్ణయిస్తుందని ఈవో స్పష్టంచేశారు.  టీటీడీపై సీఎస్ చేసిన వ్యాఖ్యలకు తాను స్పందించలేననీ..అది పాలక మండలి పరిధిలోనిదని ఆయన స్పష్టంచేశారు. కాగా శ్రీవారి ఆర్జిత టిక్కెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అనంతరం డ్రా తీసి టికెట్లను కేటాయిస్తారు. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లు ఉంటాయి.