గాలిపటం కోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. కైవల్యా నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : January 12, 2020 / 08:00 AM IST
గాలిపటం కోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. కైవల్యా నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. కైవల్యా నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గాలిపటం కోసం వెళ్లి నలుగురు చిన్నారులు నదిలో పడిపోయారు. వారిలో ఇద్దరిని స్థానికులు రక్షించగా… మిగతా ఇద్దరు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

గతంలో గాలిపటం ఎగరేస్తూ మరణించిన ఘటనలో అనేకం ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. గాలిపటం దారం మెడకు చుట్టుకుని పలురువురు చనిపోయారు. తెలంగాణలో గాలిపటం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తట్టుకోవడంతో తప్పించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసింది. 

గాలిపటం ఎగరేయాలనే సరదా ప్రాణాలకు మీదికి తెలుస్తోంది. పతంగులు ఎగరేయడం వెనుక ప్రమాదాలు పొంచివున్నాయి. గాలిపటం దారాలు చుట్టుకుని పక్షులు, జంతువులు, మనుషులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు గాలిపటాలను ఎగరేస్తారు. ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అంటున్నారు.