కాకతీయకాలువలో కొట్టుకొచ్చిన కారు..మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లెలు బావగా అనుమానం

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 05:57 AM IST
కాకతీయకాలువలో కొట్టుకొచ్చిన కారు..మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లెలు బావగా అనుమానం

కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో  ఓ కారు కొట్టుకొచ్చింది.  అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి గట్టుపైకి వెలికి తీసిన తరువాత కారులో ఉన్నవి రెండు కాదు మూడు మృతదేహాలు అని..వారిలో ఇద్దరు మహిళలు, ఇక పురుషుడు ఉన్నట్లుగా గుర్తించారు. 

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా కారు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ మూడు  మృతదేహాలు ఎవరివి? అనే కోణంలో కరీంనగర్ సీపీ కమాలహాసన్ రెడ్డి దర్యాప్తు చేపట్టగా..మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యేకు చెల్లెలు, బావలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమచారం అందించామని వారిని ప్రశ్నించి..కేసు దర్యాప్తు పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు.  

కాగా..AP15 BN 3438 నంబర్ గల కారు మిస్సింగ్ కేసు జనవరి 27న నమోదు అయ్యింది. ఆ కారులో ఓ ఫ్యామిలీ ఉందని..కారుతో సహా వారు కూడా కనిపించటంలేదని కేసు నమోదు అయ్యింది. కానీ దీన్ని పోలీసులు ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం (ఫిబ్రవరి 16,2020)న ఓ దంపతులు కాకతీయ కెనాల్ రోడ్డు మీదుగా బైక్ పై వెళుతుండగా ప్రమాదశాత్తు కాలువలో పడి గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు..ఇరిగేషన్ అధికారులు వారిని రక్షించేందుకు కాకతీయ కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. ఈ క్రమంలో AP15 BN 3438 నంబర్ గల కారు బైటపడింది. 

ఆ కారును బైటకు తీసిన పోలీసులకు దాంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలు కనిపించాయి. వాటిని కారునుంచి బైటకు వెలికి తీయించారు. ఆ కారు నారెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తిపేరుతో రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిందా? లేక మరేదైనా జరిగిందా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

కాకతీయ కాలువలో కొట్టుకొచ్చిన కారులో ఉన్న మూడు మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. ఆ మృతదేహాలకు ఘటనాస్థలంలోనే పంచనామా చేస్తామని కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డి తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి తరువాత అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. 15 రోజుల క్రితం కాకతీయ కాలువలో పడి ఉంటుందని భావిస్తున్న పోలీసులు మిస్సింగ్ కేసును ఇప్పటి వరకూ  ఎందుకు కనుగొనలేదు? ఎందుకు దర్యాప్తు చేయలేదు? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.