ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

10TV Telugu News

హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు… అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీ కింద పడి మృతి చెందారు. ఫంక్షన్‌ నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న యువకులు రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి, ఎదురుగా వస్తున్న లారీ కింద పడ్డారు.

యువకులపై నుంచి లారీ వెళ్లడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు చాదర్‌ఘాట్‌ మూసానగర్‌ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10TV Telugu News